NEWSTELANGANA

ప్ర‌జ‌ల గొంతు వినిపిస్తా

Share it with your family & friends

ఎంపీ రేణుకా చౌద‌రి

హైద‌రాబాద్ – రాజ్య‌స‌భ ఎంపీగా త‌నదైన శైలిలో ప్ర‌జ‌ల గొంతును వినిపిస్తాన‌ని అన్నారు రేణుకా చౌద‌రి. ఆమె నూత‌నంగా ఎన్నిక‌య్యారు. ఇవాళ రిట‌ర్నింగ్ అధికారి నుండి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని అందుకున్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు మోదీ అంటే వ్య‌క్తిగ‌త ద్వేషం ఏమీ లేద‌న్నారు. అపారమైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగి ఉన్న నేను ఎంద‌రో నేత‌ల‌ను చూశాన‌ని అన్నారు.

కేంద్ర మంత్రిగా, ఎంపీగా ప‌లు ప‌ద‌వులు చేప‌ట్టిన త‌న ప‌ట్ల పార్టీ న‌మ్మ‌కం ఉంచి మ‌రోసారి ఎంపీగా సీటు ఇచ్చింద‌న్నారు. త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా పార్టీ బ‌లోపేతానికి, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

రాఖీ పండుగ రోజు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి తాను రాఖీ క‌డ‌తాన‌ని చెప్పారు రేణుకా చౌద‌రి. ఇందులో ఏ మాత్రం రాజ‌కీయం అన్న‌ది ఉండ‌ద‌న్నారు. రాజ‌కీయాల‌లో ఉన్నాక అభిప్రాయ భేదాలు ఉండ‌డం అత్యంత స‌హ‌జ‌మ‌ని పేర్కొన్నారు రాజ్య‌స‌భ స‌భ్యురాలు.

దానిని వ్య‌క్తిగ‌తంగా తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. పెద్ద‌ల స‌భ‌లో త‌న అనుభ‌వం పార్టీకి ప‌నికి వ‌స్తుంద‌ని తాను న‌మ్ముతున్న‌ట్లు చెప్పారు .