వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి గుడ్ బై
రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
అమరావతి – జగన్ మోహన్ రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని, వైనాట్ 175 అనే ట్యాగ్ లైన్ తో ముందుకు వెళుతున్న ఆయనకు ఉన్నట్టుండి స్వంత నేతల నుండే వ్యతిరేకత ఎదురవుతోంది.
మరో వైపు ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన దూసుకు పోతున్నాయి. గత ఏడాది నుంచి టీడీపీ బలం మరింత పెరిగింది. ఇదే విషయాన్ని జాతీయ స్థాయి మీడియా హైలెట్ చేసింది. అంతే కాకుండా పలు సర్వే సంస్థలు కుండ బద్దలు కొట్టాయి. రాబోయేది టీడీపీ, జనసేన కూటమినేనంటూ.
దీంతో జగన్ రెడ్డికి మింగుడు పడడం లేదు. వేలాది కోట్ల రూపాయలను ప్రజల కోసం ఖర్చు చేసినా ఎందుకని ఆదరించడం లేదనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. తాజాగా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. దీనికి కారణం కీలకమైన నాయకుడిగా పేరు పొందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. తాను ఇక జగన్ తో ఉండలేనంటూ ప్రకటించారు.
ఆ మేరకు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.