కిషన్ రెడ్డిపై కోమటిరెడ్డి కన్నెర్ర
ఆయనకు అంత సీన్ లేదు
హైదరాబాద్ – రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ గంగాపురం కిషణ్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనకు ఆ పార్టీలో అంత సీన్ లేదన్నారు. తమపై ఆరోపణలు చేసేంత స్థాయి కాదన్నారు. లేని పోని విమర్శలు చేయడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు కోమటిరెడ్డి.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీని గనుక బీజేపీ టచ్ చేయాలని చూస్తే నామ రూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. నువ్వో చేతకాని మంత్రివంటూ ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కనీసం రూ. 100 కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉన్నావని నిన్ను ఎవరు గెలిపిస్తారంటూ ప్రశ్నించారు కోమటిరెడ్డి.
కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ రోజులు ఉండదంటూ కిషన్ రెడ్డి మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రజలు రాళ్లతో కొట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇకనైనా నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితే బావుంటుందని సూచించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.