NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ నియంత పాల‌న చెల్ల‌దు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన వైఎస్ ష‌ర్మిల

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. జ‌గ‌న్ నియంత పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల‌ను నిట్ట నిలువునా మోసం చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌మ‌ను మోసం చేశారంటూ ఆవేద‌న చెందిన బాధిత నిరుద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టార‌ని , ఖాకీలు ఇష్టానుసారం వారిపై దాడికి దిగ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఖాకీలు కావాల‌ని క‌క్ష క‌ట్టార‌ని ఆరోపించారు.

ఇనుప కంచెలు వేసి త‌మ‌ను బందీల‌ను చేశార‌ని ఆవేద‌న చెందారు. నిరుద్యోగుల ప‌క్షాన నిల‌బ‌డి గొంత్తెతే వ్య‌క్తిగ‌త క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ మండిప‌డ్డారు వైఎస్ ష‌ర్మిల‌. మ‌మ్మ‌ల్ని ఆపాల‌ని చూసిన మీరంతా నిజంగా నియంత‌లేన‌ని స్ప‌ష్టం చేశారు.

సీడ‌బ్ల్యూసీ స‌భ్యులు గిడుగు రుద్ర‌రాజు , వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌స్తాన్ వ‌లిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు వైఎస్ ష‌ర్మిల‌.