జనసేన..టీడీపీ గెలుపు ఖాయం
మనోహర్..అచ్చెన్నాయుడు కామెంట్
అమరావతి – జనసేన, టీడీపీ కూటమి ఏపీలో జరగబోయే ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీని నమోదు చేయడం ఖాయమని జోష్యం చెప్పారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ ఏపీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు.
ఎన్నికలకు సంబంధించి జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఇరువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని పేర్కొన్నారు. ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు సిద్దమై ఉన్నారని , ఇక పెట్టే బేడా సర్దుకునేందుకు సిద్దం కావాలని ఎద్దేవా చేశారు.
ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఆయా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన కూటమి మున్ముందు మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో వైసీపీ చేస్తున్న ఆగడాలను, అరాచకాలను, అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియ చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు నాదెండ్ల మనోహర్.