NEWSANDHRA PRADESH

బీజేపీతో త్వ‌ర‌లోనే టీడీపీ పొత్తు

Share it with your family & friends

రెండు తీర్మానాల‌కు ఆమోదం

అమ‌రావ‌తి – ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. త్వ‌ర‌లోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ మేర‌కు తాను కూడా టీడీపీతో క‌లిసి ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సంద‌ర్బంగా ఇరు పార్టీల నేత‌లు నారా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. పొత్తును స్వాగతించిన కేడర్ ను అభినందిస్తూ ఒక తీర్మానం చేశారు. అలాగే ఆంధ్రజ్యోతి, ఈనాడు పై దాడులను తప్పుబడుతూ రెండో తీర్మానం చేశారు.

బీజేపీతో మాట్లాడుతున్నామని, త్వరలోనే పొత్తు గురించి ప్రకటన ఉంటుందని, టీడీపీ ఎన్డీయేలోకి తిరిగి ప్రవేసిస్తుంది, దీనిపై స్పష్టత వస్తుందని ఏపీ టీడీపీ చీఫ్ కింజార‌పు అచ్చెన్నాయుడు వెల్లడించారు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న టీడీపీ, జనసేన బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వఃహారాల క‌మిటీ చైర్మన్ నాదెండ్ల మ‌నోహ‌ర్.