17 ఎంపీ సీట్లు గెలిపిస్తేనే హామీలు
సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇదిలా ఉండగా సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే తాము ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. లేక పోతే తాము అమలు చేయబోమంటూ చెప్పడం విడ్డూరం.
కేవలం 100 రోజుల్లోనే ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తామని లేక పోతే చేయలేమంటూ పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నాయి ప్రతిపక్షాలు. ఉచిత హామీల మేరకు జనం చెవుల్లో పూలు పెట్టారంటూ ఆరోపించారు. ఇదంతా కావాలని చేస్తున్నారే తప్పా చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదంటూ వాపోయారు.
ఈసారి జరగబోయే ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడం ఖాయమని పేర్కొంటున్నారు. ఒక బాధ్యత కలిగిన సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని వాపోయి ప్రతిపక్షాలు.