NEWSTELANGANA

జ‌ర్న‌లిస్ట్ పై దాడి దారుణం

Share it with your family & friends

మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – రాష్ట్రంలో రోజు రోజుకు ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డి పోయింద‌ని ఆవేద‌న చెందారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. కాంగ్రెస్ స‌ర్కార్ క‌క్ష సాధింపున‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా శుక్ర‌వారం స్పందించారు.

జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు రోజు రోజుకు పెరుగుతుండ‌డం దారుణ‌మ‌న్నారు. జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై జరిగిన దాడి మరువక ముందే మారో జర్నలిస్ట్ శంకర్ పై గుర్తు తెలియని గూండాలు దాడి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారనే ముద్ర వేసి, భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని అభివ‌ర్ణించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల గొంతు నొక్కడం త‌ప్ప మ‌రోటి కాద‌ని అన్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు ప్రశ్నించే జర్నలిస్ట్ ల‌పై దాడి చేయ‌డం, బెదిరించడం నీచమైన చర్య అని మండిప‌డ్డారు. ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు. ఇలాంటివి పునరవృతం కాకుండా చూడాలని కోరారు.