SPORTS

హైద‌రాబాద్ లో సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్

Share it with your family & friends

ప్ర‌క‌టించిన హెచ్ సీ ఏ ప్రెసిడెంట్

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ కీల‌క‌మైన టోర్నీకి ఆతిథ్యం ఇవ్వ‌బోతోంది. ఇప్ప‌టికే టెస్టు మ్యాచ్ ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డం, ఆదాయం స‌మ‌కూర‌డంతో వివిధ మ్యాచ్ ల‌కు కేరాఫ్ గా మార‌నుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా హెచ్ సీ ఏ ప్రెసిడెంట్ జ‌గ‌న్ మోహ‌న్ రావు వెల్ల‌డించారు. తాజాగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

బాలీవుడ్ , టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖులు సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) లో ఆడ‌తార‌ని , దీనిని హెచ్ సీ ఏ నిర్వ‌హిస్తోంద‌ని వెల్ల‌డించారు. 10 వేల మంది విద్యార్థుల‌కు ఉచితంగా ప్ర‌వేశం క‌ల్పించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

ఈ లీగ్ తొలి దశ మ్యాచ్‌లు షార్జాలో జరుగుతుండగా, మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే రెండో దశ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లీగ్‌లో ఆడేందుకు బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌తోపాటు దేశంలోని సినీ ప్రముఖులు, తారలు హైదరాబాద్‌ వస్తున్నారని తెలిపారు.

ఇంటర్మీడియట్, యూజీ, పీజీ, ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులను ఉచితంగా స్టేడియంలోకి అనుమతిస్తామని.. ఆసక్తి ఉన్న కాలేజీల ప్రిన్సిపాళ్లు HCA ఈమెయిల్ అడ్రస్ hca.ccl2024@gmail.comకు ఈమెయిల్ చేయాలని సూచించారు.

తమ విద్యాసంస్థల నుంచి ఎంతమంది విద్యార్థులు వస్తున్నారో వారి పేర్లతో సహా.. తమ సిబ్బంది పరిశీలన అనంతరం సమాధానమిస్తారని.. మ్యాచ్‌లకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ఐడీ కార్డులతో రావాలని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరుగుతాయని జగన్ మోహన్ రావు తెలిపారు. రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున మూడు రోజుల్లో ఆరు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. హీరో అక్కినేని అఖిల్ సారథ్యంలో టాలీవుడ్ టీమ్ తెలుగు వారియర్స్ ఆడుతోందన్నారు.

ముంబై హీరోస్, కేరళ స్ట్రైకర్స్, భోజ్‌పురి దబాంగ్స్, బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ డి షేర్ జట్లు తలపడనున్నాయి. ఒక్కో జట్టుకు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు ఆడతారని జగన్ మోహన్ రావు తెలిపారు.