NEWSINTERNATIONAL

శ్రీ‌లంక‌కు ఇండియా పెద్ద‌న్న‌

Share it with your family & friends

మంత్రి తార‌క బాల సూర్య కామెంట్

శ్రీ‌లంక – ప్ర‌పంచంలో తాము తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో అత్యంత భ‌రోసాను ఇచ్చింది కేవ‌లం ఒకే ఒక్క దేశం భార‌త దేశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు శ్రీ‌లంక కేంద్ర మంత్రి తార‌క బాల సూర్య‌. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కావాల‌ని కొంద‌రు త‌మ‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఇప్ప‌టికే కాదు ఎప్ప‌టికీ శ్రీ‌లంకకు నిజ‌మైన స్నేహితుడు ఇండియా మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు బాల సూర్య‌. భార‌త దేశ భ‌ద్ర‌త‌పై రాజీ ప‌డేలా ఏ తృతీయ ప‌క్షాన్ని లేదా దేశాన్ని అనుమతించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

శ్రీ‌లంకుకు ఇండియా పెద్ద‌న్న అని చెప్పారు. క‌ష్ట కాలంలో స‌హాయం చేసినందుకు తాము ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటామ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా త‌మ‌ను క‌ష్టాల క‌డ‌లి నుంచి గ‌ట్టెక్కేలా చేసినందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు తార‌క బాల సూర్య‌.
.
అప్పు ఇచ్చినంత మాత్రాన చైనా ఆధిప‌త్యాన్ని తాము ఎన్న‌టికీ ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు కేంద్ర మంత్రి.