NEWSTELANGANA

క‌మ‌లం విజ‌యం త‌థ్యం

Share it with your family & friends

ఎంపీ బండి సంజ‌య్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావ‌త్ భార‌తమంతా మోదీ జ‌పం చేస్తున్నారంటూ చెప్పారు క‌రీంన‌గ‌ర్ ఎంపీ , బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ కుమార్. విజ‌య్ సంక‌ల్ప్ యాత్ర కొన‌సాగుతోంది. ఆయ‌న‌కు జ‌నం అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈసారి కూడా గెలుపొందాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా బండి సంజ‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో లేని విధంగా త‌మ ఒక్క పార్టీనే 400 కు పైగా సీట్లు సాధించ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. త‌మ కూట‌మి తిరిగి ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి వ‌స్తుంద‌న్నారు బండి సంజ‌య్ కుమార్.

143 కోట్ల మంది భార‌తీయులు సుస్థిర‌మైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న‌ను కోరుకుంటున్నార‌ని తెలిపారు. మోదీ అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన నాయ‌కుడిగా ఇప్ప‌టికే యావ‌త్ ప్ర‌పంచం గుర్తించింద‌న్నారు. ఇలాంటి ఘ‌న‌త గ‌తంలో ఏ ప్ర‌ధాన‌మంత్రికి రాలేద‌న్నారు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.

ఆరు నూరైనా స‌రే క‌మ‌లం గెలుపును ఏ శ‌క్తి ఆప‌లేద‌ని, అడ్డు కోలేద‌న్నారు . కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేద‌న్నారు బండి. సంజ‌య్.