ప్రభుత్వ ఆస్తులను వెల్లడించండి
హెచ్ఎండీఏను ఆదేశించిన సీఎం
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన హైదరాబాద్ నగర పాలక సంస్థ అభివృద్దిపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంత కాలం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు సీఎం.
15 రోజులలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలలో విజిలెన్స్ దాడులు జరిగాయని, చాలా భవనాలకు సంబంధించి అనుమతి ఎలా ఇచ్చారంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన ఫైల్స్ ఎందుకు లేవో ఆరా తీయాలన్నారు.
తక్షణమే ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ, ఎన్ని ఉన్నాయో లెక్కలతో సహా తనకు అందజేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. హెచ్ఎండీఏ వెబ్ సైట్ నుండి సరస్సులపై ఆన్ లైన్ డేటా ఎందుకు తొలగించాలరో చెప్పాలన్నారు .
కొత్తగా ఏర్పడిన 81 మున్సిపాలిటీలకు గ్రూప్1 అధికారులను కమిషనర్లుగా నియమించినా ఎందుకని ఇంత నిర్లక్ష్యం అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఆస్తి పన్ను మదింపు కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగించమని సూచించారు. మల్టీ యుటిలిటీ టవర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం.