NEWSTELANGANA

మ‌ల్లు ర‌వి రాజీనామా

Share it with your family & friends

నాగ‌ర్ క‌ర్నూల్ బ‌రిలో ఉంటా

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీకి చెందిన ఢిల్లీలో ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా ఉన్న డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి త‌న రాజీనామా లేఖ‌ను ఇచ్చాన‌ని చెప్పారు.

శ‌నివారం డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి మీడియాతో మాట్లాడారు. తాను రాజీనామా పార్టీకి చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. కేవ‌లం ప్ర‌త్యేక ప్ర‌తినిధి పోస్టుకు మాత్ర‌మే రాజీనామా చేసిన‌ట్లు చెప్పారు. త‌న‌కు ప‌ద‌వులు ఓ లెక్క కాద‌న్నారు. గ‌తంలో ఎన్నో పోస్టులు నిర్వ‌హించిన చ‌రిత్ర ఉంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌ల్లు ర‌వి ముందు నుంచీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో, అధికారంలోకి రావ‌డంలో ఆయ‌న పాత్ర కూడా ఉంది.

త‌న‌కు జాతీయ స్థాయిలో కేబినెట్ ర్యాంక్ క‌లిగిన ప్ర‌త్యేక ప్ర‌తినిధి ప‌ద‌వి కంటే ఎంపీగా బ‌రిలో నిల‌వ‌డం ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అందుకే ఆ పద‌విని కాద‌నుకుంటున్న‌ట్లు చెప్పారు. సీఎం త‌న లేఖ‌ను ఆమోదిస్తారా లేక తిర‌స్క‌రిస్తారా అన్న‌ది తేలాల్సి ఉంద‌న్నారు మ‌ల్లుర‌వి.