NEWSTELANGANA

క‌విత అరెస్ట్ కు రంగం సిద్దం..?

Share it with your family & friends

త్వ‌ర‌లోనే జైలు పాలు కాక త‌ప్ప‌దు

హైద‌రాబాద్ – రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ తాజాగా ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు నోటీసు జారీ చేసింది. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంకు సంబంధించి త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోరింది. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని పేర్కొంది.

ఈ మేర‌కు ఢిల్లీలోని సీబీఐ ఆఫీసు ముందుకు ఈనెల 26న రావాల‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ఇప్ప‌టికే ప‌లుమ‌ర్లు సీబీఐ నోటీసులు జారీ చేసినా డోంట్ కేర్ అన్న‌ది క‌విత‌. అంత‌కు ముందు క‌విత కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కూడా చేసింది. ఆపై భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

తాను మహిళ‌న‌ని విచార‌ణ స‌మ‌యంలో త‌న‌ను అవ‌మానానికి గురి చేశార‌ని, ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాన‌ని ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ద‌మంటూ పిటిష‌న్ లో దాఖ‌లు చేసింది.