సీట్ల సర్దుబాటుపై త్వరలోనే నిర్ణయం
ప్రకటించిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల
అమరావతి – రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఆయా పార్టీలన్నీ గెలుపు వ్యూహాలపై ఫోకస్ పెట్టాయి. ఆక్టోపస్ కంటే వేగంగా విస్తరించిన జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు రంగంలోకి దిగాయి.
నిన్నటి దాకా కేవలం పేరుకు మాత్రమే పార్టీ ఉన్నా ఆశించిన మేర ప్రభావం చూపలేక పోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఎప్పుడైతే దివంగత సీఎం వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిలా రెడ్డి పార్టీ కండువా కప్పున్నదో ఆనాటి నుంచి హస్తానికి పూర్వ వైభవం ప్రారంభమైంది.
తాజాగా వామపక్షాలతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. పొత్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
రాష్ట్రంలోని అధికార , ప్రతిపక్షాలు బీజేపీకి బానిసలుగా మారి మన హక్కులను కాలరాస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి మేలు జరగాలన్నా.. విభజన హామీలు నెరవేరాలన్నా.. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు.