మొక్కు తీర్చుకున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ బాగుండాలని కోరుకున్నా
ములుగు జిల్లా – ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా పేరు పొందిన మేడారం జాతరకు లక్షలాది మంది పోటెత్తారు. ఎక్కడ చూసినా భక్త జన సందోహంతో నిండి పోయింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. కానీ ఈసారి సీన్ మారింది. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చారు.
ఈ సందర్బంగా అడవి బిడ్డల ఆరాధ్య దేవతలైన సమ్మక్క, సారలమ్మను దర్శించు కోవడం తన జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర మంత్రి దాసరి సీతక్క ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఇప్పటికే భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు.
రవాణా సదుపాయాలను ఆర్టీసీ, రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఒక్క ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలోనే 6 వేలకు పైగా బస్సులను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. మేడారం జాతర సందర్భాన్ని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ హితం కోసం తాను ఈ బంగారాన్ని ఇచ్చానని తెలిపారు.