NEWSTELANGANA

ఉద్యోగాల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాలి

Share it with your family & friends

సీఎం రేవంత్ కు ఆర్ఎస్పీ విన్న‌పం

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేర‌కు వెంట‌నే ఇప్ప‌టికే నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను వెల్ల‌డించాల‌ని, నియామ‌క ప‌త్రాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు బీఎస్పీ చీఫ్ డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

ఇదే స‌మ‌యంలో రేవంత్ సీఎంగా కొలువు తీరాక వెంట వెంట‌నే నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మంచిదేన‌ని పేర్కొన్నారు. మీ నిర్ణ‌యాన్ని తాను అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. శ‌నివారం ట్బిట్ట‌ర్ వేదిక‌గా ఆర్ఎస్పీ స్పందించారు. గురుకుల టీచర్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 2023లో దాదాపు 9,200 పోస్టుల కోసం ప్రకటన చేసిందన్నారు.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌క ముందే ఎంపికైన వారికి నియామ‌క ప‌త్రాలు ఇవ్వాల‌ని కోరారు. సీఎం ముందుగా జాబ్స్ ఖాళీలు, వాటి భ‌ర్తీపై ఫోక‌స్ పెట్టాల‌ని అన్నారు. కొన్ని సూచ‌న‌లు కూడా చేశారు ఆర్ఎస్పీ. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి బహుళ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

సాధారణంగా ఉద్యోగ ఆశావహులు ఎల్లప్పుడూ మెరుగైన వేతనం, హోదా, ఇతర పెర్క్‌లతో కూడిన ఉద్యోగాలను ఇష్టపడతారని పేర్కొన్నారు. ఒక వ్యక్తి పీజీటీ, డిగ్రీ లెక్చరర్‌కు అర్హత కలిగి ఉంటార‌ని పేర్కొన్నారు. ఒక‌వేళ రెండింటికి ఎంపికైతే స‌హ‌జంగానే డిగ్రీ లెక్చ‌ర‌ర్ పోస్టును ఎంపిక చేసుకుంటార‌ని తెలిపారు ఆర్ఎస్పీ. పీజీటీ జాబితాలో త‌దుప‌రి మెరిట్ క‌లిగిన వ్య‌క్తులు ఎంపిక‌వుతార‌ని పేర్కొన్నారు.