NEWSANDHRA PRADESH

టీడీపీ, జ‌న‌సేన అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న

Share it with your family & friends

మొత్తం 99 స్థానాల‌కు అభ్య‌ర్థులు ఖ‌రారు

అమ‌రావ‌తి – ఉత్కంఠ‌కు తెర దించుతూ తెలుగుదేశం పార్టీ, జ‌నసేన పార్టీలు సంయుక్తంగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. ఏపీలో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. పొత్తులో భాగంగా ఇరు పార్టీలు ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపాయి. చివ‌ర‌కు 99 సీట్ల‌ను ఖ‌రారు చేశాయి. 94 స్థానాల‌ను టీడీపీ ప్ర‌క‌టించ‌గా 5 సీట్లను జ‌న‌సేన పార్టీ అధిప‌తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ పార్టీ త‌ర‌పున ఐదుగురు అభ్య‌ర్థుల‌ను ఖరారు చేశారు. తెనాలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ను ఖ‌రారు చేశారు. నెల్లిమ‌ర్ల నుంచి లోకం మాద‌విని ఎంపిక చేశారు.

అన‌కాప‌ల్లి నుంచి మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ కు అవ‌కాశం ఇచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . రాజాన‌గ‌రం నుంచి బ‌త్తుల బ‌ల‌రామకృష్ణ‌, కాకినాడ రూర‌ల్ నుంచి పంతం నానాజీని ఎంపిక చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.

కాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఆయ‌న సోద‌రుడు నాగ బాబు కొణిదెలకు సంబంధించి ఇంకా ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే దానిపై క్లారిటీ రాలేదు.