ఎవరి కోసం పవన్ యుద్ధం
నిప్పులు చెరిగిన సజ్జల
తాడేపల్లి గూడెం – ఎవరి కోసం పవన్ యుద్దం చేస్తున్నారో చెప్పాలన్నారు వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. శనివారం మీడియాతో మాట్లాడారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల చీఫ్ లు నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 99 సీట్లను ఖరారు చేశారు. ఇందులో టీడీపీ 94 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా 5 సీట్లు జనసేనకు కేటాయించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
ఈ మాత్రానికి పార్టీ ఎందుకని, టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే పోయేది కదా అంటూ ఎద్దేవా చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడొ కూడా తెలియని దిక్కుతోచని స్థితిలో పవన్ కళ్యాన్ ఉన్నాడంటూ మండిపడ్డారు. ఎత్తి పోయిన టీడీపీకి పవన్ మద్దతు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.
ఈనాటి ప్రకటనతో పవన్ వందకు 100 శాతం టీడీపీకి అనుబంధంగా నడుస్తున్నారనేది మరోసారి తేట తెల్లమైందన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా చేసినా 87 శాతం జగన్ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని అన్నారు.
తాము వై నాట్ 175 అన్న ట్యాగ్ లైన్ తో ముందుకు వెళుతున్నామని చెప్పారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని తన సామాజిక వర్గాన్ని, అభిమానులను ఇలా మోసం చేయడం దారుణమన్నారు.