బీఆ\ర్ఎస్ కు బిగ్ షాక్
సర్పంచ్ లు జంప్
తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి దాకా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వచ్చిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) పార్టీ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు పక్క చూపు చూస్తున్నారు. వారంతా కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ పదే పదే కామెంట్స్ చేస్తూ వచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే వన్నాడ ప్రకాశ్ గౌడ్ , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, భార్య రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాం మోహన్ , మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ , పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ లు రాజీనామా చేశారు. గాంధారి, లింగంపేట్ , ఎల్లారెడ్డి మండలాల సర్పంచులు వారి పదవీ కాలం ముగిసింది. దీంతో బీఆర్ఎస్ కు షాక్ ఇస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.