కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట
టీడీపీ, జనసేన సీట్లు ఖరారు
అమరావతి – ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముందస్తుగా తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీల కూటమి సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఆయా పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ మొత్తం 175 స్థానాలకు గాను 99 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
ఇందులో 94 మంది అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ఖరారు చేయగా మిగతా 5 సీట్లకు జనసేన పార్టీకి చెందిన అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో అత్యధికంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఉండడం విశేషం. తెలుగుదేశం పార్టీ నుంచి 18 మందికి చోటు దక్కగా ఐదు సీట్లకు గాను ఒకరికి జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం లభించింది.
ఇంకా 76 సీట్లను ఖరారు చేయాల్సి ఉంది ఇరు పార్టీలకు చెందిన నేతలు. మరికొందరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తంగా ఈసారి ఎన్నికలు జగన్ మోహన్ రెడ్డికి పరీక్షగా మారాయి. అన్ని సర్వే సంస్థలు మూడ్ ఆఫ్ ది ఏపీ ఓటర్ పేరుతో ప్రకటించిన ఫలితాలు గంప గుత్తగా సీఎంకు వ్యతిరేకంగా ఉండడం విశేషం.