DEVOTIONAL

తిరుమ‌ల క్షేత్రం భ‌క్త జ‌న సందోహం

Share it with your family & friends

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. రోజు రోజుకు భ‌క్తుల తాకిడి పెరుగుతోంది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ).

ఇదిలా ఉండ‌గా 72 వేల 175 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 29 వేల 543 మంది భ‌క్తులు త‌ల నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు.

ఎంబీసీ వెనుక వైపు వ‌ర‌కు ప్ర‌స్తుతం ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్నారు భ‌క్తులు. ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 18 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని టీటీడీ తెలిపారు.

మ‌రో వైపు శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడు ర‌మ‌ణ దీక్షితులుపై తిరుమ‌ల వ‌న్ టౌన్ లో కేసు న‌మోదు చేసిన‌ట్లు స‌మాచారం.