మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి
నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ – ప్రముఖ జర్నలిస్టు ప్రజాపక్షం సంపాదకుడు కె. శ్రీనివాస్ రెడ్డికి అరుదైన పదవి దక్కింది. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏరికోరి రెడ్డిని ఎంచుకుంది. ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం కె. శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఉమ్మడి ఏపీ చంద్రబాబు నాయుడు పాలనలో మీడియా అకాడమీ చైర్మన్ గా గతంలో పని చేశారు కె. శ్రీనివాస్ రెడ్డి.
ఏపీ ప్రభుత్వం విడి పోయాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ అకాడమీ చైర్మన్ గా ప్రముఖ జర్నలిస్టు , సంపాదకుడు అల్లం నారాయణను నియమించింది. ఆయన హయాంలో తీవ్రమైన అవినీతి, ఆరోపణలు ఎదుర్కొన్నారు. రెండోసారి చైర్మన్ గా పదవిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆనాటి సర్కార్.
కొత్తగా కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరిన వెంటనే రాష్ట్రానికి చెందిన పలు కార్పొరేషన్ ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించింది.