బీజేపీ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ
దిల్ రాజు..ఈటలకు టికెట్లు ఖరారు
హైదరాబాద్ – రాష్ట్రంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను బీజేపీ హై కమాండ్ అభ్యర్థులను ఖరారు చేసింది. విచిత్రం ఏమిటంటే ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (వెంకట రమణా రెడ్డి )కు కూడా సీటు ఇవ్వడం విస్తు పోయేలా చేసింది.
బీజేపీ స్టేట్ చీఫ్ , కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ సీటును కేటాయించింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ , నిజామా బాద్ నుంచి ధర్మపురి అరవింద్, జహీరాబాద్ నుంచి దిల్ రాజుకు టికెట్లను ఖరారు చేసింది.
చేవెళ్ల లోక్ సభ స్థానానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజ్ గిరి నుండి ఈటెల రాజేందర్ , మురళీ ధర్ రావు, మల్కా కొమరయ్య, చాడ సురేష్ రెడ్డి, మెదక్ నుంచి రఘునందన్ రావు, అంజి రెడ్డి , మహబూబ్ నగర్ నుంచి ఏపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ, శాంతి కుమార్ , నాగర్ కర్నూల్ నుంచి బంగారు శ్రుతి, కె. రాములును పరిశీలిస్తోంది.
నల్లగొండ నుంచి జితేంద్ర కుమార్, సైది రెడ్డి, రాజా రామ్ యాదవ్ , చిన్నప్ప రెడ్డి, ఖమ్మం నుంచి వినోద్ రావు, డాక్టర్ వెంకటేశ్వర్లు, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ , మనోహర్ రెడ్డి, వెదిరె శ్రీరామ్ , వరంగల్ నుంచి కృష్ణ ప్రసాద్, సుభాష్ ల పేర్లను పరిశీలిస్తోంది బీజేపీ.