NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ కు జోగయ్య లేఖ

Share it with your family & friends

24 సీట్లు గెలిచే స‌త్తా లేదా

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ , ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై నిప్పులు చెరిగారు హ‌రిరామ జోగ‌య్య‌. ఆయ‌న ఆదివారం సుదీర్ఘ లేఖ రాశారు. టీడీపీ లేక పోతే జ‌న‌సేన త‌న స‌త్తా చాట లేదా అని ప్ర‌శ్నించారు. క‌నీసం 24 సీట్లు కూడా గెలిచే ద‌మ్ము, ధైర్యం లేదా అని నిల‌దీశారు. పోయి పోయి జ‌న‌సేన ప‌రిస్థితి మరీ ఇంత అధ్వాన్నంగా ఉందా అని మండిప‌డ్డారు హ‌రి రామ జోగ‌య్య‌.

ఎందుక‌ని ఇంత త‌క్కువ స్థాయిలో సీట్లు తీసుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. అంటే కాపులు దేనికీ ప‌నికి రారా అని పేర్కొన్నారు. ఒకరు ఇవ్వ‌డం ఇంకొక‌రు తీసుకోవ‌డం ఇదేనా పొత్తు ధ‌ర్మం అంటే ఎద్దేవా చేశారు. ఈ పొత్తు కూడా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మేన‌ని చెప్ప‌గ‌ల‌రా అని ఫైర్ అయ్యారు .

మొత్తంగా చూస్తే కాపుల ప‌రిస్థితి రాష్ట్రంలో దయ‌నీయంగా ఉంద‌న్నారు. మా కోటా మా వాటా అనే నినాదంతో తామంతా ఎదురు చూస్తున్నామ‌ని, ఇన్నేళ్ల పాటు ఒక పార్టీని న‌డిపింది ఇందు కోస‌మేనా అని ఫైర్ అయ్యారు.

టీడీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య జ‌రిగిన పొత్తు ఒప్పందం వ‌ల్ల జ‌న సైనికులు తీవ్ర నిరాశ‌తో ఉన్నార‌ని ఈ విష‌యం మీకు తెలుసా లేక తెలియ‌న‌ట్లు న‌టిస్తున్నారా అంటూ ధ్వ‌జ‌మెత్తారు హ‌రిరామ జోగ‌య్య‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు రెండున్న‌ర ఏళ్ల పాటు సీఎంగా ఉండాల‌ని , సీట్ల షేరింగ్ లో స‌గం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.