సీబీఐ విచారణకు కవిత డుమ్మా
హాజరు కావాలని దర్యాప్తు సంస్థ నోటీసు
హైదరాబాద్ – ఢిల్లీ మద్యం కుంభ కోణం కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోంది తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సీబీఐ దర్యాప్తు సంస్థ పలుమార్లు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. తొలుత హైదరాబాద్ లో కవిత నివాసంలో విచారించింది.
అనంతరం ఢిల్లీలోని సీబీఐ ఆఫీసుకు రావాలంటూ ఆదేశించింది. భారీ భద్రత మధ్య కవిత హాజరయ్యారు. ఫోన్లు మార్చిందని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెకు కీలకమైన పాత్ర ఉందని అభియోగాలు మోపింది.
తాజాగా తెలంగాణలో సీన్ మారింది. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. బీఆర్ఎస్ తన అధికారాన్ని కోల్పోయింది. ఈ సమయంలో కేంద్ర ఏజెన్సీ కవితకు మరోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 26న తప్పక హాజరు కావాలని ఆదేశించింది నోటీసులో.
అయితే ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆయనకు కూడా నోటీసులు ఇచ్చినా ఆయన వెళ్లలేదు. వాటిని ఖాతరు చేయలేదు. తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనని, వర్చువల్ గా మాత్రమే హాజరవుతానని స్పష్టం చేశారు కవిత.