కాంగ్రెస్ సర్కార్ ఖుష్ కబర్
గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఈ మేరకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని తాజాగా జరిగిన ఎన్నికల్లో గ్యారెంటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు రూ. 80 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం.
మార్చి 3న చేవెళ్లలో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉచిత గ్యాస్ పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఆధ్వర్యంలో ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కల్పిస్తోంది. ప్రత్యేకించి పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది.
రైతు బంధు స్థానంలో రైతు భరోసా కింద డబ్బులను జమ చేసింది . మొత్తం ఎన్నికలలో ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇప్పటి వరకు రెండింటిని అమలు చేస్తోంది. ఇదే సమయంలో ఇంకా రెండు పథకాలకు కూడా శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.