దేశానికి ప్రేమ కావాలి
ఎంపీ రాహుల్ గాంధీ
యూపీ – దేశానికి కావాల్సింది ద్వేషం కాదని శాశ్వతమైన ప్రేమ కావాలని పిలుపునిచ్చారు ఏఐసీసీ మాజీ చీఫ్ , ఎంపీ రాహుల్ గాంధీ. యూపీలో కొనసాగుతోంది భారత్ జోడో న్యాయ్ యాత్ర. ఈ యాత్రలో రాహుల్ తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.
143 కోట్ల మంది ప్రజలు న్యాయం, సమానత్వం , సమాన అవకాశాలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు ప్రేమ , శాంతి, సామరస్యం, పురోగతిని కోరుకుంటున్నట్లు తెలిపారు. న్యాయం కోసం చేసే ఈ గొప్పనైన ప్రయాణంలో యావత్ ప్జానీకం, దేశం పూర్తిగా ఐక్యంగా ఉండాలని కోరుకుంటోందని, ఈ విషయం తాను చేపట్టిన యాత్రలో స్పష్టమైందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
దేశం ప్రస్తుతం సంక్షోభంలో కొనసాగుతోందని, కేవలం ప్రజలను భ్రమల్లో ఉంచేందుకు మాత్రమే కేంద్ర సర్కార్ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందన్నారు రాహుల్ గాంధి. ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.