బాబు బెయిల్ పిటిషన్ వాయిదా
మరో మూడు వారాల పాటు ఊరట
న్యూఢిల్లీ – ఏపీ స్కిల్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలై చివరకు బెయిల్ పై విడుదలయ్యారు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. తనను అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేశారని, తనకు ఏ పాపం తెలియదని వాపోయారు.
ఈ మేరకు చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. గతంలో ఈ కేసుకు సంబంధించి వాదోప వాదనలు కొనసాగాయి.
సోమవారం తిరిగి ఇదే కేసుకు సంబంధించి విచారణ కొనసాగింది. బెయిల్ రద్దు పిటిషన్ పై కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది ధర్మాసనం. దీంతో చంద్రబాబు నాయుడు కు కొంత ఊరట లభించినట్లయింది.
ఇదిలా ఉండగా ఏపీ సీఐడీ తీవ్రమైన అభియోగాలు మోపింది చంద్రబాబుపై. ఆయనపై ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదు చేసింది. మాజీ సీఎంతో పాటు తనయుడు నారా లోకేష్ , మాజీ మంత్రి నారాయణను కూడా చేర్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం వీరి మెడకు చుట్టుకునేలా ఉంది.