DEVOTIONAL

ముంబైలో ఘ‌నంగా శ్రీ‌వారి క‌ళ్యాణం

Share it with your family & friends

భారీ ఎత్తున హాజ‌రైన భ‌క్త బాంధ‌వులు

ముంబై – ముంబై మహా నగరంలోని తూర్పు దోంభివలి ప్రాంతంలో ఆదివారం రాత్రి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం అంగ‌రంగ వైభ‌వోపేతంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడారు. టీటీడీ నిర్వహిస్తున్న సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని అభినందించారు. స్వామివారి కల్యాణం లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది చెప్పారు. కల్యాణోత్సవం లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఎంపి శ్రీకాంత్ షిండే, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. రాత్రి 10 గంటల దాకా ఈ క‌ళ్యాణోత్స‌వం ఘ‌నంగా కొన‌సాగింది. ప్ర‌పంచ వ్యాప్తంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున శ్రీ‌వారి క‌ళ్యాణోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తోంది.