NEWSTELANGANA

రైతు బంధు దారి మ‌ళ్లింపు

Share it with your family & friends

ఏఈవో అరెస్ట్ చేసిన పోలీస్

హైద‌రాబాద్ – గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో రైతు బంధు, బీమా సొమ్ము రూ. 2 కోట్లు దారి మ‌ళ్లించిన కేసులో కీల‌క మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సైబ‌రాబాద్ పోలీస్ ఏఈవోను అదుపులోకి తీసుకున్నారు. న‌కిలీ గుర్తింపుల‌ను ఉప‌యోగించి వీటిని స్వంతానికి వాడుకున్నారంటూ ఆరోపించారు.

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండ‌లం అగిర్యాల్ క్ల‌స్ట‌ర్ లో వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ అధికారిగా ఉన్న గోరేటి శ్రీ‌శైలం రైతు బీమా కింద భారతీయ జీవిత బీమా సంస్థ మొత్తాన్ని 20 నకిలీ క్లెయిమ్‌లలో రూ. 1 కోటి రూపాయలతో పాటు, 130 మంది నకిలీ పట్టాదార్లు, రైతుబంధు పథకం హక్కుదారులు కాని వారి పేరుతో మ‌రో కోటి రూపాయ‌లు దారి మ‌ళ్లించాడ‌ని తెలిపారు.

రైతు బంధు పథకాన్ని దుర్వినియోగం చేయ‌డం నిధులను 2019 నుండి నేటి దాకా కోటి వ‌సూలు చేశాడ‌ని చెప్పారు. రైతు బీమా, రైతు బంధు పథకాన్ని దారి మళ్లించేందుకు శ్రీశైలం పథకం పన్నారని, రైతు బీమా, రైతుబంధు పోర్టల్ ద్వారా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నుంచి డేటాను సేకరించి ఎల్‌ఐసీ నుంచి 20 నకిలీ క్లెయిమ్‌లు పొంది 130 మందిని మోసం చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఏఈవో కొందుర్గు లో 2.35 ఎక‌రాల భూమిని, తుమ్మ‌ల‌ప‌ల్లిలో 8.20 ఎక‌రాల పొలాన్ని, భార్య పేరు మీద ఆస్తులు కొనుగోలు చేశార‌ని తెలిపారు.