NEWSNATIONAL

గజ‌ల్ కింగ్ ఇక లేరు

Share it with your family & friends

పంక‌జ్ ఉధాస్ మృతి

ముంబై – భార‌తీయ సినీ రంగంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ను క‌లిగిన గొప్ప గాయ‌కుడు , గ‌జ‌ల్ కింగ్ పంక‌జ్ ఉధాస్ సోమ‌వారం క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 72 ఏళ్లు. గ‌జ‌ల్ ప్ర‌క్రియ‌కు ప్రాణం పోశారు. చిట్టీ ఆయీ హై లాంటి పాపుల‌ర్ పాట‌ల‌తో కోట్లాది మందిని ప్ర‌భావితం చేస్తూ వ‌చ్చారు. గ‌త కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది ప‌డ్డారు. ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు కుటుంబీకులు ఇవాళ వెల్ల‌డించారు.

ఈ విష‌యం గురించి కూతురు న‌యాబ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశారు. చాలా బరువైన హృదయంతో, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా పద్మశ్రీ పంకజ్ ఉదాస్ మరణించిన విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

పంకజ్ ఉదాస్ ఎన్నో పాట‌లు పాడారు. గ‌జ‌ల్స్ ఆలాపించారు. అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు చాలా ఉన్నాయి. వాటిలో చిట్టి ఆయీ హై, ఔర్ ఆహిస్తా కిజియే బాతే, జీయే తో జీయే కైసే , నా కజ్రే కి ధార్ వంటి అనేక ఇతర పాటలు ఉన్నాయి. అనేక ఆల్బమ్‌లను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కచేరీలలో ప్రదర్శన ఇచ్చారు. తన మధురమైన గాత్రం, పదునైన సాహిత్యంతో ప్రేక్షకులను ఆకర్షించాడు.

పంకజ్ ఉధాస్ సంగీతానికి అందించిన సేవలకు అనేక ప్రశంసలు అందుకున్నాడు, ఇందులో పద్మశ్రీ, భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి, 2006లో అతనికి అందించారు.