NEWSTELANGANA

తీగ‌ల అనితా ..కృష్ణా రెడ్డి జంప్

Share it with your family & friends

కాంగ్రెస్ లో చేరిన నేత‌లు

హైద‌రాబాద్ – భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీకి సీనియ‌ర్ నేత‌లు ఒక‌రి వెంట మ‌రొక‌రు గుడ్ బై చెబుతున్నారు. సోమవారం మ‌రో రెండు వికెట్లు ప‌డ్డాయి. రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ తీగ‌ల అనితా రెడ్డి గాంధీ భ‌వ‌న్ లో తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ సార‌థ్యంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. అంత‌కు ముందు ఆమె త‌న భ‌ర్త మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణా రెడ్డితో క‌లిసి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

అంత‌కు ముందు భారీ కుదుపు ఏర్ప‌డింది బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజేంద్ర న‌గ‌ర్ ఎమ్మెల్యే వ‌న్నాడ ప్ర‌కాష్ గౌడ్ జంప్ అయ్యారు. ఆ త‌ర్వాత ఇదే పార్టీకి చెందిన పెద్ద‌ప‌ల్లి ఎంపీ వెంక‌టేశ్ నేత ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువాను క‌ప్పుకున్నారు.

హైద‌రాబాద్ న‌గ‌ర మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ కూడా జంప్ అయ్యారు. ఆయ‌న మాజీ మంత్రి కేటీఆర్ కు అనుంగు అనుచ‌రుడిగా గుర్తింపు పొందారు. మొత్తంగా రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అవుతున్న‌ట్టే అనిపిస్తోంది. మైనార్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ డిప్యూటీ మేయ‌ర్ బాబా ఫ‌సియోద్దీన్ సైతం కాంగ్రెస్ లో చేరారు.