ప్రియాంక..రేవంత్ పై కేటీఆర్ ఫైర్
నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్న
నాగర్ కర్నూల్ జిల్లా – మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామంటూ హామీ ఇచ్చారని, అది ఇప్పుడు ఏమైందంటూ ప్రశ్నించారు.
ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి ప్రజల చెవుల్లో పూలు పెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. సొల్లు కబుర్లు చెప్పడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు.
ఆరు నూరైనా సరే తాము ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తామని స్పష్టం చేశారు కేటీఆర్. ప్రచార ఆర్భాటం తప్ప రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తాము చేసిన పనుల గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎంకు లేదన్నారు కేటీఆర్.
దేశంలోనే అత్యున్నతమైన కంపెనీలను తీసుకు వచ్చిన ఘనత తనదేనని పేర్కొన్నారు. ఇవాళ అవాకులు చెవాకులు పేలడం మానేయాలని, ప్రజల కోసం పని చేయడం నేర్చుకుంటే బెటర్ అని సలహా ఇచ్చారు మాజీ మంత్రి.