సమస్యలు పోవాలంటే మోదీ రావాలి
ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పాటిల్
గుజరాత్ – రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో పేరుకు పోయిన సమస్యలు పరిష్కారం కావాలంటే తిరిగి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రావాలని పిలుపునిచ్చారు సీఎం. ఆయన గనుక రాక పోతే దేశం అంధకారంలోకి వెళుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్క హిందువు దీని గురించి ఆలోచించాలన్నారు.
ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి అంత సీన్ లేదన్నారు. గత పది సంవత్సరాలుగా అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్న చరిత్ర తమ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు భూపేంద్ర భాయ్ పాటిల్.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని అన్నారు సీఎం. 500 ఏళ్ల తర్వాత ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట చేసిన ఘనత ఒక్క ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకే దక్కుతుందన్నారు భూపేంద్ర భాయ్ పాటిల్.
గతంలో గుజరాత్ లో ఎన్నో సమస్యలు పేరుకు పోయి ఉండేవి. మోదీ సీఎం కాక ముందు. కానీ మోదీ తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యాక అన్నింటినీ తీర్చారని అదే పాలసీని దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారని అన్నారు.