హరీశ్ చేతగాని సన్నాసి
సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. తెడ్డు తిప్పేది చేతగాని సన్నాసి అంటూ ఎద్దేవా చేశారు. పదేళ్లుగా మంత్రిగా ఉండి ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పూర్తిగా విధ్వంసం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సంక్షోభానికి కారకులు ఎవరో నాలుగున్నర కోట్ల ప్రజలకు తెలుసన్నారు. దీనిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, తలకు మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత మీది కాదా అన్నారు రేవంత్ రెడ్డి. వ్యవస్థలను నిర్వీర్యం చేసి , నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. మామ, కొడుకుల నిర్వాకం చూసి జనం నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు .
బీఆర్ఎస్ ను పాతి పెట్టడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే లోపు గులాబీ ఖాళీ కావడం పక్కా అని జోష్యం చెప్పారు. మాయ మాటలు చెప్పడం, ఆస్తులను పోగేసుకున్నది నిజం కాదా అని నిలదీశారు రేవంత్ రెడ్డి.