ప్లీజ్ నాగర్ కర్నూల్ సీటు నాకివ్వండి
సీఎం రేవంత్ రెడ్డితో మల్లు రవి
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీలో నాగర్ కర్నూల్ ఎంపీ సీటుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటూ ఓటమి పాలైన సంపత్ కుమార్ మల్లు రవి కంటే ముందే ప్రచారంలో ముందంజలో ఉన్నారు. తను కూడా ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఇదే సమయంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు మల్లు రవి.
ఇది కేబినెట్ హోదా ర్యాంక్ కలిగిన పదవి. విచిత్రం ఏమిటంటే తను కూడా నాగర్ కర్నూల్ లోక్ సభ నుంచి బరిలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. లోక్ సభ ఎన్నికలు, టికెట్ల కేటాయింపు, ఇతర అంశాలపై విస్తృతంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో చర్చించారు మల్లు రవి.
దయచేసి తనకు టికెట్ కావాలని కోరడం విస్తు పోయేలా చేసింది. ఈ సందర్బంగా తనకు పూర్తి హామీ ఇచ్చారని చెప్పారు మల్లు రవి. మహబూబ్ నగర్ లోక్ సభ ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు చల్లా వంశీ చందర్ రెడ్డిని. మొత్తంగా సంపత్ వర్సెస్ మల్లు రవిగా మారింది.