వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేస్తాం
టీడీపీ నేత కొలికిపూడి శ్రీనివాసరావు
అమరావతి – అమరావతి జేఏసీ సభ్యుడు, తిరువూరు టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తామంటూ సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
ప్రజలను మోసం చేసిన ఘనత ఏపీ సీఎం జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందన్నారు. ప్రజలపై దాడులు పెరిగాయని, ప్రతిపక్షాలను లేకుండా చేయాలని అనుకోవడం దారుణమన్నారు.
వైసీపీని ఓడించాలని, జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు కొలికిపూడి శ్రీనివాస రావు. తెలుగుదేశం, జనసేన కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు.
వైసీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. తనను ఓడించడం జగన్ రెడ్డికి చేత కాదన్నారు. ఎన్ని వ్యూహాలు చేసినా , ఎన్ని కుట్రలు పన్నినా తనను అడ్డుకోవడం భావ్యం కాదని పేర్కొన్నారు.