NEWSTELANGANA

ఫార్మా రంగంలో తెలంగాణ టాప్

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైద‌రాబాద్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానంలో కొన‌సాగుతోంద‌న్నారు. మూడో వంతు ఫార్మా ఉత్పత్తులు రాష్ట్రం నుంచే వస్తున్నాయని అన్నారు.

హైదరాబాద్ హైటెక్స్ లో 2024 బయో ఆసియ సదస్సు ను మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సదస్సులో మాట్లాడుతూ 300 ఎకరాల్లో 2 వేల కోట్లతో జీనోమ్ వ్యాలీ రెండో దశ ని చేపడుతున్నట్లు చెప్పారు.

మొత్తం రాష్ట్రంలో 3 చోట్ల ఫార్మ విలేజ్ లను ఏర్పాటు చేస్తామని అన్నారు. హైదరాబాద్ ను లైఫ్ సైన్సెస్ కి రాజధానిగా మారుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి దావోస్ వేదికగా 40 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వివరించారు.

వ్యాక్సిన్ రంగంలోనూ రాష్ట్రం ముందుందని చెప్పారు. కోవిడ్ అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఫార్మా రంగంలో ఎదురవుతున్న సవాళ్లు తనకు తెలుసని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రపంచంలో3 కోవిడ్ వాక్సిన్లు వస్తే అందులో ఒకటి హైదరాబాద్ లో తయారైందని సీఎం అన్నారు. హైదరాబాద్ ఐటీ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉంటే సైబరాబాద్ పరిశోధన రంగంలో అగ్ర భాగంలో ఉందన్నారు రేవంత్ రెడ్డి.