మార్చి 1న బీఆర్ఎస్ ఛలో కాళేశ్వరం
ప్రకటించిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిరాధార ఆరోపణలు చేస్తోందంటూ ఆరోపించారు. మంగళవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ టూర్ కు వ్యతిరేకంగా మార్చి 1న భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఛలో బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 13న సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డను సందర్శించారు. దీనికి వ్యతిరేకంగా తాము ఈ ఛలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు కేటీఆర్.
ఎంపీలు సైతం కూడా ఇందులో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఈ టూర్ లో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను సందర్శిస్తామని పేర్కొన్నారు మాజీ మంత్రి.