రోజా ఓ ఐటెం రాణి – బండ్ల
చేపల పులుసు పెడితే పదవులు రావు
హైదరాబాద్ – కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ నిర్మాత , నటుడు బండ్ల గణేశ్ రెచ్చి పోయారు. ఆయన మరోసారి ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై నోరు పారేసుకున్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని జాక్ పాట్ సీఎం అని రోజా కామెంట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. రేవంత్ ను ఎవరు కామెంట్ చేసినా తాను ఊరుకునే ప్రసక్తి లేదన్నారు .
రోజా ఓ ఐటం రాణి అని చేపల పులుసు పెడితే ఇక్కడ పదవులు రావన్నారు. రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్ అంటూ కితాబు ఇచ్చారు. కేసీఆర్ కొడుకుగానే తప్పా కేటీఆర్ కు ఎలాంటి గుర్తింపు లేదన్నారు. ఆయనకు అంత సీన్ లేదంటూ మండిపడ్డారు బండ్ల గణేశ్.
జగన్ మోహన్ రెడ్డి ఒక యాక్సిడెంటల్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై కూడా బండ్ల గణేశ్ సెటైర్లు వేశారు. కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారని… పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు.
కేటీఆర్ చుట్టూ ఈగో వైఫై మాదిరి ఉంటుందని… వచ్చే ఎన్నికల్లో ఏదో సాధిస్తామనే భ్రమల్లో ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ కు మరిన్న కష్టాలు తప్పవని జోస్యం చెప్పారు.