దాడి చేసినా అదరను బెదరను
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్
కరీంనగర్ జిల్లా – భారతీయ జనతా పార్టీ కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం ప్రజా హిత యాత్ర చేపట్టిన సందర్బంగా తనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొందరు రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీనిపై తీవ్రంగా స్పందంచారు బండి సంజయ్ కుమార్ పటేల్. తనపై దాడికి ఉసిగొల్పిన వాళ్లకు సవాల్ విసురుతున్నానని అన్నారు. పిరికి వాడిలా తాను పారి పోయేటోడిని కానని అన్నారు. ధైర్యంగా ధర్మం గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు.
ఈ లోక్ సభ ఎన్నికల్లో నువ్వు కానీ , నువ్వు నిలబెట్టిన అభ్యర్థి కానీ నా మీద గెలిస్తే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని ప్రకటించారు బండి సంజయ్ కుమార్. ఒకవేళ ఓడి పోతే నువ్వు తీసుకుంటావా..ఈ సవాల్ ను స్వీకరించే దమ్ము, ధైర్యం నీకుందా అంటూ నిలదీశారు. మొత్తంగా ఈ దాడితో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మరిన్ని గొడవలకు దారి తీసే ప్రమాదం పొంచి ఉంది.