ఎన్నికల బరిలో జై శంకర్ ..నిర్మల
వెల్లడించిన భారతీయ జనతా పార్టీ
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. మరో వైపు ఎన్నికల వాతావరణం దేశాన్ని అల్లుకుంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేందుకు సమాయత్తం అవుతోంది కేంద్ర ఎన్నికల సంఘం.
ఇదిలా ఉండగా బీజేపీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. గతంలో రాజ్య సభకు ఎంపికైన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ , కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లు ఈసారి లోక్ సభ ఎన్నికల బరిలో ఉండ బోతున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ ప్రకటించింది. మంగళవారం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని వెల్లడించారు. జై శంకర్ , నిర్మలా సీతారామన్ లు దక్షిణాదిలో పోటీ చేయనున్నట్లు తెలిపారు. వారిద్దరూ బీజేపీ ప్రతిష్టను పెంచడంలో కీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు.
కేంద్ర కేబినెట్ లో పలు మార్పులు చేసినా ఈ ఇద్దరిని మాత్రం మార్చేందుకు ఇష్ట పడలేదు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ, కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా. భారత దేశానికి విదేశాలలో మంచి సంబంధాలను పెంపొందించడంలో కృషి చేశారు జై శంకర్. ఇక ఆర్థిక శాఖ మంత్రి గా నిర్మలా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో కీలక పాత్ర పోషించారు.