మావోయిస్టులపై కిష‌న్ రెడ్డి కీల‌క కామెంట్స్

రాజ్యాంగానికి లోబ‌డి ఎవ‌రు చేరినా ఓకే

అమ‌రావ‌తి : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మావోయిస్టుల‌పై. మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న అంశంపై కేంద్ర స్పందించారు. ప్రజా స్వామ్య దేశంలో అంబెడ్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి ఎవరు ఏ పార్టీలో అయిన చేరొచ్చని అన్నారు. అయితే నక్సలైట్లు , మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వచ్చి ఏ రాజకీయ పార్టీలో చేరుతారో అన్నది వాళ్ళ ఇష్టం అని పేర్కొన్నారు.
రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ప్రభుత్వాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్ప‌ష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఆపరేషన్ ఖాగర్ కొనసాగుతుందని ప్ర‌క‌టించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చిందా అని ప్ర‌శ్నించారు.

రేవంత్ రెడ్డి కెసిఆర్ బ్రాండ్ కోసం కెసిఆర్ రేవంత్ రెడ్డి బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం జరగడం లేదని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ కు కేంద్రం చేసిన పనులపై లెక్కలతో సహా లేఖ రాసినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రు కూడా స్పందించ లేద‌న్నారు కిష‌న్ రెడ్డి. తెలంగాణ లో లంకె బిందలు ఉన్నాయనుకుంటే ఖాళీ బిందెలు ఉన్నాయ‌ని బ‌హిరంగంగా చెప్పిన సీఎం వెయ్యి కోట్లు కాంగ్రెస్ అధిష్టానానికి ఎలా ఇవ్వాలి అనుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కిష‌న్ రెడ్డి.

  • Related Posts

    మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలి

    న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకు మ‌హిళ‌ల ప‌ట్ల పెరుగుతున్న వేధింపులు, అత్యాచారాల ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వేధింపులు, రేప్ ల‌కు వ్య‌తిరేకంగా యువ‌త ఉద్య‌మించాల‌ని…

    తెలంగాణ‌లో 13 రోజుల పాటు ద‌స‌రా సెల‌వులు

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. విద్యార్థులు, పేరెంట్స్ కు తీపి క‌బురు చెప్పింది. దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో 13 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్ర‌క‌టించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా పండుగ దృష్ట్యా తెలంగాణ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *