డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలం
సీపీ అవినాష్ మహంతి వార్నింగ్
హైదరాబాద్ – తీగ లాగితే డొంకంతా కదులుతోంది. నిన్న పోలీసులు జరిపిన దాడుల్లో డ్రగ్స్ తో పట్టుబడ్డారు పలువురు. దీనికి కేరాఫ్ గా మారింది ప్రముఖ హోటల్ , పబ్ రాడిసన్ బ్లూ . ఇందులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కొడుకుతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖ దర్శకుడు క్రిష్ కూడా ఉండడం విస్తు పోయేలా చేసింది.
ఈ మొత్తం వ్యవహారం ఇటు రాజకీయ రంగంలో అటు సినీ రంగంలో కలకలం రేపుతోంది. ఈ సందర్బంగా సీపీ అవినాష్ మహంతి సంచలన కామెంట్స్ చేశారు. ఎవరు ఏ రంగానికి చెందిన వారైనా తాము వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. కొందరిని పట్టుకున్నామని, మరికొందరు తప్పించుకు పోయారని , వారి భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు.
నిందితుల జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తామన్నారు. ఇప్పటి వరకు గజ్జల వివేకానంద్ , కేదార్ సెలగం శెట్టి, నిర్బయ్ సింధీ డ్రగ్స్ తీసుకున్నట్లు ఇప్పటికే పరీక్షల్లో తేలిందన్నారు సీపీ. చాలా మంది తమ మొబైల్ ఫోన్లు లేదా వారి నివాసాల్లో అందుబాటులో లేకుండా పోయారని తెలిపారు.