ఏపీలో 6,28,347 ఉద్యోగాల క‌ల్ప‌న : సీఎం

Spread the love

శాస‌న స‌భ‌లో వివ‌రాలు వెల్ల‌డించిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు శాస‌న స‌భ సాక్షిగా. గ‌త స‌ర్కార్ నిరుద్యోగుల‌ను మోసం చేసింద‌న్నారు. కానీ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని తెలిపారు. పెద్ద ఎత్తున కంపెనీలు ఇక్క‌డ పెట్టుబ‌డి పెట్టేందుకు ఉత్సుక‌త ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌ని చెప్పారు. గ‌త 20 నెలల్లో కూటమి ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం 6,28,347 ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఏ రంగంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెబుతూ స్పష్టమైన వివ‌రాలు వెల్ల‌డించారు.

డీఎస్సీ, కానిస్టేబుళ్ల‌కు సంబంధించి మొత్తం 30,607 జాబ్స్ ఇచ్చామ‌న్నారు సీఎం. ఎంఎస్ఎంఈల నుంచి 2,48,906 మందికి ఉపాధి క‌ల్పించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. అంతే కాకుండా జాబ్ ఫెయిర్, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 మందికి ఊర‌ట ల‌భించింద‌ని తెలిపారు. ఇక ప‌రిశ్ర‌మ‌ల రంగంలో 95, 174 మంది, ఆహార ప్రాసెసింగ్ లో 64 వేల 35 మందికి జాబ్స్ ఇప్పించ‌డం జ‌రిగింద‌న్నారు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో 13,866 మందికి, ప‌ర్యాట‌క రంగంలో 5 వేల 28 మందికి జాబ్స్ ఇప్పించ‌డం జ‌రిగింద‌న్నారు సీఎం .

  • Related Posts

    పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం సీఎం స‌మీక్ష

    Spread the love

    Spread the loveకీల‌క సూచ‌న‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై బుధ‌వారం స‌చివాల‌యంలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వ‌హించారు. పాపులేషన్ మేనేజ్మెంట్‌పై చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చ‌ర్చించారు.…

    జ‌గ‌న్ రెడ్డికి పండితుల ఆశీర్వాదం

    Spread the love

    Spread the loveపులివెందుల లోని ఆయ‌న నివాసంలో క‌డ‌ప జిల్లా : మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా జిల్లాలోని పులివెందుల త‌న‌ నివాసంలో,కోదండ రామాలయానికి చెందిన వేద పండితులు విచ్చేసి ప్రత్యేకంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *