16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా నిషేధం

Spread the love

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీఎం సిద్ద‌రామ‌య్య‌. గ‌త కొంత కాలంగా పిల్ల‌ల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతోంది సోష‌ల్ మీడియా. దీని కార‌ణంగా పెద్ద ఎత్తున ఆత్మ‌హ‌త్య‌లు, రేప్ లు, హ‌త్య‌లు , కేసులు, వేధింపులు కొన‌సాగుతున్నాయి. ఈ త‌రుణంలో 16 ఏళ్ల లోపు ఉన్న వారికి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు శాస‌న స‌భ వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేశారు సీఎం. తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. యువతపై మొబైల్ దుష్ప్రభావం నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు సిద్ద‌రామ‌య్య‌.

కర్ణాటక స‌ర్కార్ ప్ర‌వేశ పెట్టిన‌ కొత్త బడ్జెట్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించాలని యోచిస్తోంద‌న్నారు. 2026–27 రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన ఈ ప్రతిపాదన, యువ వినియోగదారులలో పెరుగుతున్న మొబైల్ ఫోన్ వినియోగం ప్రతికూల ప్రభావాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు సీఎం. పిల్లలపై స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా ప్రభావం గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ చర్య తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. విధాన నిర్ణేతలు, పాఠశాలలు , తల్లిదండ్రులు స్క్రీన్ సమయం పెరగడం, ఆరోగ్యంతో పాటు అభ్యాసంపై దాని ప్రభావం గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నార‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    మ‌మ‌తా బెన‌ర్జీకి కీల‌క నేత‌ల మ‌ద్ద‌తు

    Spread the love

    Spread the loveచీల‌క దిశ‌గా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ లో ప్ర‌భుత్వాన్ని కోల్పోయిన టీఎంసీ ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది.బెంగాల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి మధ్య, మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ (TMC)లో పార్టీకి…

    హైద‌రాబాద్ లో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆందోళ‌న

    Spread the love

    Spread the loveకేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి హైద‌రాబాద్ : అభిజిత్ దీప్కే సార‌థ్యంలోని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) ఆధ్వ‌ర్యంలో ఆదివారం హైద‌రాబాద్ లోని ఇందిరా పార్కు వ‌ద్ద భారీ ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ నిరసనలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *