16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా నిషేధం

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీఎం సిద్ద‌రామ‌య్య‌. గ‌త కొంత కాలంగా పిల్ల‌ల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతోంది సోష‌ల్ మీడియా. దీని కార‌ణంగా పెద్ద ఎత్తున ఆత్మ‌హ‌త్య‌లు, రేప్ లు, హ‌త్య‌లు , కేసులు, వేధింపులు కొన‌సాగుతున్నాయి. ఈ త‌రుణంలో 16 ఏళ్ల లోపు ఉన్న వారికి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు శాస‌న స‌భ వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేశారు సీఎం. తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. యువతపై మొబైల్ దుష్ప్రభావం నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు సిద్ద‌రామ‌య్య‌.

కర్ణాటక స‌ర్కార్ ప్ర‌వేశ పెట్టిన‌ కొత్త బడ్జెట్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించాలని యోచిస్తోంద‌న్నారు. 2026–27 రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన ఈ ప్రతిపాదన, యువ వినియోగదారులలో పెరుగుతున్న మొబైల్ ఫోన్ వినియోగం ప్రతికూల ప్రభావాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు సీఎం. పిల్లలపై స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా ప్రభావం గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ చర్య తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. విధాన నిర్ణేతలు, పాఠశాలలు , తల్లిదండ్రులు స్క్రీన్ సమయం పెరగడం, ఆరోగ్యంతో పాటు అభ్యాసంపై దాని ప్రభావం గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నార‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలి

    న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకు మ‌హిళ‌ల ప‌ట్ల పెరుగుతున్న వేధింపులు, అత్యాచారాల ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వేధింపులు, రేప్ ల‌కు వ్య‌తిరేకంగా యువ‌త ఉద్య‌మించాల‌ని…

    తెలంగాణ‌లో 13 రోజుల పాటు ద‌స‌రా సెల‌వులు

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. విద్యార్థులు, పేరెంట్స్ కు తీపి క‌బురు చెప్పింది. దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో 13 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్ర‌క‌టించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా పండుగ దృష్ట్యా తెలంగాణ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *