NEWSANDHRA PRADESH

వైసీపీతో ఎమ్మెల్యే ‘కాపు’ క‌టీఫ్

Share it with your family & friends

రామ‌చంద్రారెడ్డి కామెంట్స్

అమ‌రావ‌తి – ఏపీలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ ఊహించ‌ని షాక్ త‌గిలింది వైసీపీకి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను తాను క‌లిసేందుకే వ‌చ్చాన‌ని అన్నారు.

త‌మ జిల్లాకు సంబంధం లేని స‌మావేశం ఇక్క‌డ జ‌ర‌గ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు ఎమ్మెల్యే. అందుకే కీల‌క‌మైన మీటింగ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాన‌ని స్ప‌ష్టం చేశారు కాపు రామ చంద్రా రెడ్డి. ఎప్పుడు ఏ పార్టీలో జాయిన్ అయ్యేది త‌ర్వాత ప్ర‌క‌టిస్తాన‌ని అన్నారు.

ప్ర‌స్తుతానికి పూర్తిగా ఏ నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. తాను వైసీపీని పూర్తిగా వ‌దిలి వేశాన‌ని చెప్పారు . ఆ పార్టీతో త‌న‌కు సంబందం లేద‌ని పేర్కొన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను క‌చ్చితంగా బ‌రిలో ఉంటాన‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు కాపు రామ‌చంద్రా రెడ్డి.

ఎమ్మెల్యే అయిన త‌న‌కు స‌మావేశానికి సంబంధించి ఎటువంటి స‌మాచారం ఇవ్వ‌క పోవ‌డంపై మండిప‌డ్డారు. రాజ్ నాథ్ సింగ్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశాన‌ని చెప్పారు.