NEWSANDHRA PRADESH

అనిత‌ను ప‌రుగెత్తించి కొడ‌తాం

Share it with your family & friends

ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్

అమ‌రావ‌తి – ఏపీలో మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ప్ర‌ధానంగా టీడీపీ వ‌ర్సెస్ వైసీపీగా మారింది. ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. రాజ‌కీయంగా అయితే ప‌ర్వా లేదు. కానీ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగ‌డం ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

తెలుగుదేశం పార్టీకి చెందిన నాయ‌కురాలు అనిత సీరియ‌స్ కామెంట్స్ చేసింది ఐటీ మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్ పై. రాబోయే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో గుడివాడ గుండు ప‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పింది. దీనిపై తీవ్రంగా స్పందించారు ఐటీ శాఖ మంత్రి.

వ‌ళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాల‌ని, స‌భ్య‌త సంస్కారం అన్న‌ది లేకుండా ఏది ప‌డితే అది మాట్లాడితే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని అన్నారు . సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని, ఆయ‌న భార్య భార‌తీ రెడ్డిని ఏమైనా అంటే స‌హించ బోమంటూ హెచ్చ‌రించారు.

త‌ప్పుడు కూత‌లు కూస్తే తాట తీస్తామ‌ని అన్నారు. అంతే కాదు అనిత‌ను ప‌రుగులు పెట్టించి కొడ‌తామంటూ నోరు పారేసుకున్నారు గుడివాడ అమ‌ర్ నాథ్. ఇద్ద‌రు నేత‌లు చేసిన కామెంట్స్ పై జ‌నం న‌వ్వుకుంటున్నారు.